సండే స్టోరీ @ మన ప్రత్తిపాడు
ఆ రోజులే బాగున్నాయి !!👌
👉టెన్షన్స్,వత్తిళ్ళు, డబ్బు సంపాదన ఇలాంటి అతిగా ఆలోచనలు లేకున్నా.ఉన్నంతలో కుటుంబం అంతా కలసి ఆనందంగా గడిపిన ఆ రోజులే బాగున్నాయి. ఆదివారం ఆటలు ఆడుతూ ఆనందాన్ని మరచినా ఆ రోజులే బాగున్నాయి. మినరల్ వాటర్ కొనుకోలేక కుళాయి దగ్గర బోరింగులదగ్గర బావుల దగ్గర నీళ్లు తగిన ఆ రోజులే బాగున్నాయి.ఎండాకాలం చాలివేంద్రం లోని చల్లని నీరు కోసం ఎర్రని ఎండని సైతం లెక్క చెయ్యని ఆ రోజులే బాగున్నాయి. వందల కొద్దీ ఛానళ్లు లేకున్నా ఉన్న ఒక్క దూరదర్శన్ లో శుక్రవారం చిత్రలహరి ఆదివారం సినిమా కోసం ఎదురుచూసిన ఆ రోజులే బాగున్నాయి.సెలవుల్లో అమ్మమ్మ,నాన్నమ్మ ఊళ్లకు వెళ్లి ఇంటికి రావాలని ఆలోచనే లేని ఆ రోజులే బాగున్నాయి. మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ చాకలెట్లు పంచిన ఆ రోజులే బాగున్నాయి.మట్టున్ బిరియాని,చికెన్ బిరియాని లేకున్నా ఎండాకాలం వచ్చింది అంటే మామిడికాయ పచ్చడితో అందరం కలిసి కడుపు నిండా అన్నం తిన్న ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు జేబు నిండా,కార్డ్ నిండా డబ్బులుఉన్న అమ్మ కొట్టుకు పంపినప్పుడు చిల్లర కాచేసి కొన్నుకొని తిన్న ఆ రోజులే బాగున్నాయి.ఇప్పుడు చేతిలోని సెల్ నిండా గేమ్స్ ఉన్నా ఆటస్థలంలో ఒక్క బ్యాటు తో బ్యాటు మార్చుకుంటూ క్రికెట్ ఆడిన ఆరోజులే బాగున్నాయి. బీరువా నిండా జీన్స్ ప్యాంట్లు,టీ షీర్ట్లు ఉన్న 2,3 నిక్కర్లతో కురచ చొక్కాలతో బడికి వెళ్లిన ఆ రోజులే బాగున్నాయి.ఇప్పుడు బ్యాకరీల్లో కూల్ కేక్లు తింటున్న 25 పైసల ఆశ చాక్లెట్లు తిన్నా ఆ రోజులే బాగున్నాయి.ఇప్పుడు రక రకాల ఐస్క్రీమ్ లు నోట్లో నానుతున్న అమ్మమ్మ నాయనమ్మ ల చేత చీర కొంగు లోనుంచి పుల్ల ఐసు కొనుక్కొని తిన్న ఆ రోజులే బాగున్నాయి పొద్దు పోయేదాకా పాపం పనులు చేసుకొని ఎలాంటి చిరాకు లేకుండా ఇంటికి చేరుకొని చందమామని చూస్తూ నిద్రలోకి వెళ్తూ కలలు కన్న ఆ రోజులే బాగున్నాయి. ఏమైనా ఆ రోజులే బాగున్నాయి మిత్రమా !! @మన ప్రత్తిపాడు. fb/prathipadu.

No comments:
Post a Comment