జిఎస్ టి అసలు ఎలా రూపొందించారు @మన ప్రత్తిపాడు!!
భారత ప్రభుత్వము, హైదరాబాద్
_జిఎస్ టి అమలు- పరోక్ష పన్ను ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయడం;_
ఇందుకు రంగాన్ని ఎలా సిద్ధం చేసిందీ చాటిచెప్పే వివరణ
వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి) ఒక చరిత్రాత్మకమైనటువంటి పన్నుల సంబంధ సంస్కరణ. ఇది 2017 జులై 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. జిఎస్ టి దేశంలోని కేంద్ర, రాష్ట్ర పన్నులతో కూడిన పరోక్ష పన్ను ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుంది. సాధారణ ప్రయోగ పద్ధతికి భిన్నంగా జిఎస్ టి ని కేంద్రం మరియు రాష్ట్రాలు కలసి అమలు జరుపుతాయి.
ఈ చరిత్రాత్మకమైనటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా 2017 జూన్ 30 - జులై 1వ తేదీ ల మధ్య రాత్రి సమయంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయ రాష్ట్రపతి, గౌరవనీయ ఉప రాష్ట్రపతి, గౌరవనీయ ప్రధాన మంత్రి, గౌరవనీయ లోక్ సభ స్పీకర్ మరియు గౌరవనీయ ఆర్థిక మంత్రి ఇంకా ఇతర మాననీయ వ్యక్తులు హాజరు కానున్నారు.
*_జిఎస్ టి ఎందుకు అంత ముఖ్యమైందంటే_*
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చోటు చేసుకొన్న అత్యంత పెద్ద పన్నుల సంబంధిత సంస్కరణే జిఎస్ టి. ఇది ‘ఒక దేశం- ఒక పన్ను- ఒక మార్కెట్’ అనే లక్ష్యాన్ని సాకారం చేసుకొనేందుకు బాట వేస్తుంది. సంబంధిత వర్గాలన్నింటికీ అంటే- పరిశ్రమ, ప్రభుత్వం, వినియోగదారులకు- జిఎస్ టి లాభం చేకూర్చుతుంది. ఇది వస్తువులు, సేవల ఖర్చును తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని అందిస్తుంది. మన వస్తువులు, సేవలను ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేటట్టుగా చేస్తుంది. తద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఒక పెద్ద ఊతం లభించగలదు. జిఎస్ టి విధానంలో ఎగుమతులు ఇప్పుడు అమలవుతున్న విధానానికి భిన్నంగా సున్నా రేటువిగా మారుతాయి. ఇప్పుడు అమలవుతున్న విధానంలో పరోక్ష పన్నులు అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలకు మధ్య చీలిపోయిన కారణంగా కొన్ని రకాల పన్నుల వాపసుకు ఆస్కారం లేకుండా వుంది. జిఎస్ టి భారతదేశాన్ని ఉమ్మడి రేటులు, విధివిధానాలతో కూడి ఉండే ఒక సాధారణ విపణిగా మార్చుతుంది. ఆర్థిక అవరోధాలను తొలగిస్తుంది. జిఎస్ టి ప్రధానంగా సాంకేతికత చోదకంగా పనిచేస్తుంది. ఇందులో మానవ ప్రమేయం అనేది చాలావరకు తగ్గిపోతుంది. జిఎస్ టి భారతదేశంలో సులువుగా వ్యాపారం చేయడాన్ని గణనీయంగా మెరుగుపరచగలుగుతుందని భావిస్తున్నారు.
అనేక వస్తువుల సరఫరాలకు జిఎస్ టి కౌన్సిల్ ఆమోదించిన మేరకు విధించిన పన్ను, ప్రస్తుతం అమలవుతున్న కేంద్రం, రాష్ట్రాల సమష్టి పరోక్ష పన్ను రేటుల కన్నా [ప్రస్తుతం అమలవుతున్న పన్ను రేటులలో.. సెంట్రల్ ఎక్సయిజ్ డ్యూటీ రేటులు/ ఎంబెడెడ్ సెంట్రల్ ఎక్సయిజ్ డ్యూటీ రేటులు/ సర్వీస్ ట్యాక్స్ పోస్ట్ క్లియరెన్స్ ఎంబెడింగ్, విఎటి రేటులు లేదా వెయిటెడ్ ఏవరేజ్ విఎటి రేటులు, ఎక్సయిజ్ డ్యూటీ, సిఎస్ టి, దారి సుంకం, ప్రవేశ పన్ను తదితరాల రీత్యా వాటికి తోడు విఎటి కుమ్మరింత.. కలిసివుంటున్నాయి) చాలా తక్కువ స్థాయిలో ఉంది.
*
రాజ్యాంగ సవరణ చట్టం, 2016 అనంతరం జిఎస్ టి ప్రస్థానం*
2016 సెప్టెంబరు 8 వ తేదీ నాడు గౌరవనీయ రాష్ట్రపతి అనుమతితో 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 2016 ఆచరణలోకి వచ్చింది. జిఎస్ టి కౌన్సిల్ ను 15.9.2016 నాడు ఏర్పాటు చేశారు.
2016 సెప్టెంబరు లో జిఎస్ టి కౌన్సిల్ ఏర్పాటు అయినప్పటి నుంచి 18 సమావేశాలను నిర్వహించింది. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు లేదా వారి ప్రతినిధులు, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల అధికారులతో సహా ఈ విస్తృత స్థాయి సమావేశాలలో పాలుపంచుకొని, ఈ చరిత్రాత్మకమైనటువంటి పన్నుల సంబంధ సంస్కరణకు చట్ట రూపాన్ని, విధి విధానాన్ని రూపొందించారు. 27 వేల గంటలకు పైగా సాగిన తీవ్ర కృషితో కూడినటువంటి ఎంతో పెద్ద కార్యభారమిది. జిఎస్ టి అమలు కోసం కేంద్ర అధికారులకు, రాష్ట్రాల అధికారులకు మధ్య దేశంలోని వివిధ ప్రాంతాలలో 200కు పైగా సమావేశాలు జరిగాయి.
జిఎస్ టి చట్టాలు మరియు నియమావళిని రూపొందించేటపుడు, పన్ను చెల్లింపు దారులకు సులభతరంగా వ్యాపారం చేసుకొనే వీలును పెంపొందించాలనేది కీలకమైన చర్చాప్రతిపాదనగా ఉంది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ పాత్రలు, బాధ్యతలను తదనుగుణంగానే నిర్వచించారు. స్వల్ప అవధిలో, జిఎస్ టి కౌన్సిల్ కాంపెన్సేషన్ సెస్, విభిన్నమైన రేటు శ్లాబులలోకి వస్తువులు, సేవల వర్గీకరణ, మినహాయింపులు, ప్రభావ సీమ లు (థ్రెషోల్డ్ స్), పన్ను అమలు విధానం వంటివి సహా జిఎస్ టి చట్టాలను, జిఎస్ టి నియమాలను, పన్ను రేటు స్వరూపాన్ని ఆమోదించడం జరిగింది. కౌన్సిల్ నిర్ణయాలను అన్నింటినీ ఏకాభిప్రాయంతో తీసుకొన్నారు. చట్టాలను మరియు నియమావళిని రూపొందించేటపుడు, వ్యాపార, పరిశ్రమ వర్గాల వారితోను, ఇంకా ఇతర ముఖ్యమైన సంబంధిత వర్గాల వారితోను విస్తృత స్థాయిలో భాగస్వామ్యపూర్వక సంప్రదింపులు చేపట్టడమైంది. ముసాయిదా చట్టాలు, నియమావళులను వెబ్ సైట్ లలో పొందుపరచడంతో పాటు వాటిపై ప్రజల నుంచి ప్రతిస్పందనను కూడా స్వీకరించడమైంది.
*2017 మార్చి 29న, గౌరవనీయ భారత ఆర్థిక మంత్రి వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి) బిల్లులు నాలుగింటిని లోక్ సభ పరిశీలన, ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. ఈ నాలుగు బిల్లుల పేర్లు.. ది సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సిజిఎస్ టి) బిల్లు, 2017; ది ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజిఎస్ టి) బిల్లు, 2017; ది యూనియన్ టెరిటరీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (యుటిజిఎస్ టి) బిల్లు, 2017 మరియు జిఎస్ టి (కాంపెన్సేషన్ టు స్టేట్స్) బిల్లు, 2017. వీటిని 2017 మార్చి 29న లోక్ సభ, 2017 ఏప్రిల్ 6న రాజ్య సభ ఆమోదించాయి.*
జిఎస్ టి కి సంబంధించి ఈ కింద పేర్కొన్న తుది స్వరూపాన్ని జిఎస్ టి కౌన్సిల్ ఖాయం చేసింది:
• జిఎస్ టి ని విధించడానికి రాష్ట్రాలకు ప్రభావ సీమ (థ్రెషోల్డ్ లిమిట్) ను స్పెషల్ కేటగిరీ మినహా రూ.20 లక్షలుగా ఖరారు చేశారు. స్పెషల్ కేటగిరీలో ఇది రూ.10 లక్షలు గా ఉంది.
• జిఎస్ టి కోసం నాలుగు శ్లాబ్ రేటుల స్వరూపాన్ని స్వీకరించారు. ఈ నాలుగు శ్లాబ్ రేటులు 5%, 12%, 18% మరియు 28% గా ఉన్నాయి.
• విలాసవంతమైన కార్లు, వాయుపూరిత పానీయాలు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు తదితర కొన్ని రకాల వస్తువులపైన 28% జిఎస్ టి రేటు కు మించిన సెస్సును విధిస్తారు. రాష్ట్రాలకు కాంపెన్సేషన్ చెల్లింపు కోసం ఇలా చేస్తారు.
• కాంపొజిషన్ స్కీమును పొందేందుకుగాను ప్రభావ సీమ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు మినహా రూ.75 లక్షలు గా ఉంది. స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలలో ఇది రూ.50 లక్షలుగా ఉంది. అంతే కాక అవి కేవలం త్రైమాసిక రిటర్న్ లు సమర్పించితే సరిపోతుంది. కొన్ని కేటగిరీలకు చెందిన తయారీదారు సంస్థలు, సేవల సరఫరాదారు సంస్థలు (రెస్టారెంట్ లు తప్ప) కాంపొజిషన్ స్కీము కు వెలుపల ఉంటాయి.
*
జిఎస్ టి యొక్క ఇతర ముఖ్యమైన అంశాలు*
• అన్ని లావాదేవీలు, ప్రక్రియలు ఒక్క ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరగాలని జిఎస్ టి చెబుతోంది. ఒకరి జోక్యం ఉండకూడదనే ఈ పద్ధతిని నిర్దేశించారు. ఇది పన్ను చెల్లింపుదారులతో పన్నుల అధికారులు జోక్యం చేసుకోవడాన్ని తగ్గించివేస్తుంది.
• ఆటో-పాప్యులేటెడ్ మంత్ లీ రిటర్న్ స్, యాన్యువల్ రిటర్న్ సౌకర్యాన్ని జిఎస్ టి అందిస్తుంది.
• జిఎస్ టి పన్ను చెల్లింపుదారులకు 60 రోజుల లోపల గ్రాంట్ ఆఫ్ రిటర్న్ ను నిర్దేశిస్తుంది కూడా. అలాగే, 90% రిఫండ్ ను 7 రోజుల లోపల తాత్కాలికంగా మంజూరు చేస్తుంది కూడా. ఇతర సౌలభ్య చర్యలలో.. సకాలంలో రిఫండ్ మంజూరు కాని పక్షంలో వడ్డీ చెల్లింపు, రిఫండ్ ను నేరుగా బ్యాంక్ ఖాతాలలోకి క్రెడిట్ చేయడం వంటివి ఉన్నాయి.
• ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు జిఎస్ టి విధానంలోకి సాఫీగా మార్పు చెందేందుకు వీలుగా సమగ్రమైన పరివర్తన నిబంధనావళి, అందుబాటులో ఉన్న నిల్వలకు క్రెడిట్ సదుపాయం వగైరాలు.
• జిఎస్ టిని పాటిస్తున్నందుకుగాను రేటింగు వ్యవస్థ వంటివి ఇతర నిబంధనలలో చేరి ఉన్నాయి.
జిఎస్ టి నెట్ వర్క్ (జిఎస్ టిఎన్) పాత్ర - జిఎస్ టి కి వెన్నెముకగా ఐటి
జిఎస్ టిఎన్ ను 25వ సెక్షన్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా ఏర్పాటు చేయడమైంది. దీనిలో వ్యూహాత్మక నియంత్రణ ప్రభుత్వం వద్దే ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు ఒక ఉమ్మడి పాస్- త్రూ పోర్టల్ గా పనిచేస్తుంది. ఈ ఉమ్మడి పోర్టల్ లో పన్ను చెల్లింపుదారులు వారి రిజిస్ట్రేషన్ దరఖాస్తులను సమర్పిస్తారు; రిటర్న్ లను దాఖలు చేస్తారు; పన్నులు చెల్లిస్తారు; రిఫండ్ లను క్లెయిమ్ చేస్తారు. జిఎస్ టిఎన్ కు ఒక దృఢమైన ఐటి ప్లాట్ ఫామ్ ను సమకూర్చారు. ఇది 80 లక్షల పన్ను చెల్లింపుదారులకు వేలాది పన్నుల అధికారుల తో ఇంటర్ ఫేస్ ను ప్రసాదిస్తుంది. జిఎస్ టి లో భాగంగా అన్ని ఫైలింగులు ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే జరుగుతాయి. జిఎస్ టిఎన్ అనేది ఒక ఫ్రంట్-ఎండ్ గా ఉంటే, బ్యాక్-ఎండ్ లో సిబిఇసి యొక్క ఐటి వ్యవస్థలు, జిఎస్ టిఎన్ ఐటి నెట్ వర్క్ తో వివిధ రాష్ట్రాల ఇంటర్ ఫేస్ తోడై పన్ను చెల్లింపుదారులకు పన్ను రిటర్న్ యొక్క ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ సీమ్ లెస్ గా సాగేందుకు సహకరిస్తాయి. 64,000 మంది అధికారులకు జిఎస్ టి పోర్టల్ పై పనిచేయటానికి 2017 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు శిక్షణ ఇవ్వడమైంది. జిఎస్ టిఎన్ ఐటి వ్యవస్థలు లోడ్ టెస్టులు, పెర్ఫామెన్స్ టెస్టులు, వల్నరబులిటీ టెస్టులు, భద్రత, ఇతర తప్పనిసరి పరీక్షలను పూర్తి చేసుకొన్నాయి.
రాష్ట్రాల పన్నుల యంత్రాంగాల పరిధిలోని ప్రస్తుత పన్ను చెల్లింపుదారు లు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ జిఎస్ టి వ్యవస్థలోకి నమోదు కావటమనేది 2016 నవంబర్ 8 నాడు మొదలైంది. 66 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు వారి అకౌంటులను జిఎస్ టి పోర్టల్ లో యాక్టివేట్ చేసుకొన్నారు.
జిఎస్ టి అప్లికేషన్ అన్ పేమెంట్ పనిచేయడం ప్రారంభించింది. 25 బ్యాంకులను జిఎస్ టి కామన్ పోర్టల్ తో సమన్వయపరిచారు. ఇవి ఇ-పేమెంట్ మరియు ఓవర్ ది కౌంటర్ పేమెంట్ సౌకర్యాలతో పాటు ఎన్ఇఎఫ్ టి/ఆర్ టిజిఎస్, క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు ల సదుపాయాలను సమకూర్చుతాయి.
*జిఎస్ టి జాగృతి కార్యక్రమం*
ప్రభుత్వం వేరు వేరు కార్యక్రమాలు, వర్క్ షాపులు, ప్రసార మాధ్యమాలు, టెలివిజన్ ద్వారా సాధారణ ప్రజానీకానికి తన జిఎస్ టి జాగృతి కార్యక్రమాన్ని తీసుకుపోయే చొరవను ముమ్మరం చేసింది. అన్ని స్థాయిలలోను సిబిఇసి క్షేత్ర బృందాలను క్రియాశీలం చేసి వ్యాపార, పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ వారు జిఎస్ టి కి మళ్లేందుకుగాను వారి సందేహాలను తీర్చాలని, వారికి సహాయపడాలని సూచించడమైంది. సిబిఇసి క్షేత్ర విభాగాలు సంచార వాహనాల ద్వారా అసెసీల గుమ్మాల వద్దకు చేరుకొని వారు జిఎస్ టి కి మైగ్రేట్ అయ్యేందుకు, పరివర్తన క్రమంలోని అంశాలను పరిష్కరించేందుకు తగిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. భారతదేశం అంతటా మొత్తం సుమారు 4700 వర్క్ షాపులను నిర్వహించడం జరిగింది.
పన్ను చెల్లింపుదారులు మరియు ఇతర సంబంధితవర్గాల వారందరు జిఎస్ టి లోకి సునాయాసంగా మారేటట్టు వారికి సమాచారం అందించడం, వారి సందేహాలు తీర్చడం, వారికి సహాయపడడానికి ముద్రణ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారాను, ప్రకటనల వంటి వాటి ద్వారాను విస్తృతమైన ప్రచారం చేపట్టబడింది.
*
సిబిఇసి పునర్ వ్యవస్థీకరణ*
జిఎస్ టి అమలు ప్రక్రియ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ కస్టమ్స్ యొక్క పునర్ వ్యవస్థీకరణకు దారితీసింది. ఇందుకుగాను నిర్మాణ పరమైన మార్పులు, మానవ వనరుల పునర్ మోహరింపు అవసరమయ్యాయి. మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందేందుకు తగిన విధంగా వనరుల పునర్ మోహరింపు చోటు చేసుకొంది. జిఎస్ టి లో ముఖ్య పాత్రను కలిగివున్న డైరెక్టరేట్ లను సముచితమైన రీతిలో విస్తరించడం, పటిష్టపరచడం పూర్తయింది.
21 సిజిఎస్ టి & సిఎక్స్ జోన్ లు, 107 సిజిఎస్ టి & సిఎక్స్ కమిషనరేట్ లు, 12 సబ్-కమిషనరేట్ లు, 768 సిజిఎస్ టి & సిఎక్స్ డివిజన్ లు, 3969 సిజిఎస్ టి & సిఎక్స్ రేంజ్ లు, 48 ఆడిట్ కమిషనరేట్ లు, 49 అప్పీలు కమిషనరేట్ లు గా ఫీల్డ్ ఫార్మేషన్ లను పునర్ నిర్మించారు.
*
శిక్షణ*
జిఎస్ టి సాఫీగా అమలు కావడం కోసం, చాలినంత కెపాసిటీ-బిల్డింగ్ కసరత్తు, అవగాహన చేపట్టుకోవడం అనివార్యం. నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (ఎన్ఎసిఐఎన్) విస్తృత స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. ఒకటో దశలో, దేశవ్యాప్తంగా 2016 సెప్టెంబరు నుంచి 2017 జనవరి వరకు నిర్వహించిన బహుళ విధ శిక్షణ కార్యక్రమంలో సుమారు 52,000 మంది అధికారులు శిక్షణ పొందారు. సవరించిన చట్టం, నియమావళి, విధి విధానాలపై ఒక రిఫ్రెషర్ ట్రయినింగ్ ను కూడా నిర్వహించగా, 2017 జూన్ 23 వరకు 17,213 మంది అధికారులు శిక్షణ పొందారు. అక్రెడిటెడ్ జిఎస్ టి శిక్షణ కార్యక్రమంలో భాగంగా వ్యాపారం/పరిశ్రమ సభ్యులు, ఇతర సంబంధిత వర్గాల వారికి ‘సహేతుకమైన ఖర్చులో నాణ్యమైన శిక్షణను అందించడం’ కోసం 20 ఇన్ స్టిట్యూట్ లకు ‘ఆమోదం పొందిన శిక్షణ భాగస్వామ్య సంస్థలు’ గా ధ్రువీకరణను పొందాయి. (ఈ శిక్షణ ఇంకా కొనసాగుతోంది ) . 2,565 మంది పార్టిసిపెంట్ లకు ఇంతవరకు శిక్షణ పొందారు. ఎన్ఎసిఐఎన్ కూడా 92 మంత్రిత్వ శాఖలు/ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 2,611 మంది అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
అంతే కాకుండా, జిఎస్ టి కి సంబంధించిన 500 తరచుగా అడిగే ప్రశ్నల (FAQs) కు సమాధానాల వంటి శిక్షణ సంబంధ వనరులను ఇంగ్లిషు, హిందీ మరియు 10 ప్రాంతీయ భాషలలో విడుదల చేయడం జరిగింది. జిఎస్ టి కి సంబంధించిన వేరు వేరు ముఖ్యాంశాలను సమగ్రంగా వివరిస్తూ అనేక చిన్న ప్రకటన పత్రాలను వ్యాపార, పరిశ్రమ వర్గాలకు అందజేయడమైంది. జిఎస్ టి శిక్షణ, తదితర శిక్షణ సామగ్రిని అధికారుల ఉపయోగార్థం స్లయిడ్ షోలు, లెర్నింగ్ వీడియోలను కూడా విడుదల చేయడమైంది.
సామాజిక మాధ్యమాల ద్వారా సేవ
పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలకు రియల్ టైమ్ ప్రాతిపదికన సమాధానాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఒక ట్విటర్ సేవను ప్రారంభించింది. askGST_GOI పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్ కు ప్రతి రోజూ పన్ను చెల్లింపుదారుల నుంచి వేలాది ప్రశ్నలు అందుతున్నాయి. ట్విటర్ లో తరచుగా అడుగుతున్న ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలతో ఒక జాబితాను ఇప్పటికే ప్రచురించడం జరిగింది.